నిరుద్యోగులకు గుడ్ న్యూస్: DRDL జాబ్స్.. డిసెంబర్ 22, 23 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ.. హైదరాబాద్ లోనే..!

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్: DRDL జాబ్స్.. డిసెంబర్ 22, 23 తేదీల్లో  వాక్ ఇన్ ఇంటర్వ్యూ.. హైదరాబాద్ లోనే..!

డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్​డీఓ డీఐఆర్ఎల్) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

  • ఈ నెల 22, 23వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 

పోస్టులు:  46. 
విభాగాలు:  గ్రాడ్యుయేట్ (టెక్నికల్) ఈసీఈ 12, గ్రాడ్యుయేట్ (టెక్నికల్) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ 04, గ్రాడ్యుయేట్ (టెక్నికల్) సీఎస్ఈ/ ఏఐ–ఎంఎల్ 10, గ్రాడ్యుయేట్ (టెక్నికల్) మెకానికల్ 02, గ్రాడ్యుయేట్ (టెక్నికల్) ఎలక్ట్రికల్ 02, టెక్నీషియన్ ఈసీఈ 02, టెక్నీషియన్ సీఎస్ఈ 2, టెక్నీషియన్ సివిల్ 02, గ్రాడ్యుయేట్ (నాన్ టెక్నికల్) బి.కాం. కంప్యూటర్స్ 05, గ్రాడ్యుయేట్ (నాన్ టెక్నికల్) బీఎస్సీ కంప్యూటర్స్ 05. 
ఎలిజిబిలిటీ: గ్రాడ్యుయేట్ టెక్నికల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, సీఎస్ఈ/ ఐటీ/ ఏఐ-ఎంఎల్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బి.ఇ/బి.టెక్. ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
టెక్నీషియన్: ఈసీఈ, సీఎస్ఈ, సివిల్ ఇంజనీరింగ్​​లో సంబంధిత విభాగాల్లో  డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ నాన్-టెక్నికల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి బి.కాం. కంప్యూటర్స్, బి.ఎస్సీ. కంప్యూటర్స్ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా

వాక్ ఇన్ ఇంటర్వ్యూలు 

గ్రాడ్యుయేట్/ టెక్నికల్: డిసెంబర్ 22. 
గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్: డిసెంబర్ 23. 

  • చిరునామా: ​డీఎల్ చాంద్రాయణగుట్ట, హైదరాబాద్ 500005 చిరునామాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.