ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ ఎందుకు క్యాన్సల్ చేసుకుంటున్నారు? "QuitGPT" వెనుక అసలు కథ ఇదే..

ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ ఎందుకు క్యాన్సల్ చేసుకుంటున్నారు? "QuitGPT" వెనుక అసలు కథ ఇదే..

ప్రస్తుతం వేల మంది యూజర్లు  చాట్‌జిపిటి (ChatGPT) ప్రీమియం మెంబర్‌షిప్‌లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ వల్ల కాదు, దీని వెనుక కొన్ని రాజకీయ, సామాజిక కారణాలు ఉన్నాయి. ఓపెన్ ఏఐ (OpenAI) అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మాన్ సహా  ఆయన భార్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సపోర్ట్  చేసే ఒక సంస్థకు దాదాపు $25 మిలియన్ల అంటే రూ. 200 కోట్లకు పైగా భారీ విరాళం ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ఇది చాలా మంది చాట్‌జిపిటి యూజర్లకు నచ్చలేదు.

అలాగే  అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం (ICE) వారు ఉద్యోగాల సెలక్షన్ కోసం ChatGPT-4ని వాడుతున్నారని, దీనివల్ల సామాన్యులకు ఇబ్బందులు కలగవచ్చని కొందరు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు యూజర్లు చాట్‌బాట్ ఇచ్చే సమాధానాలు అతి మర్యాదగా ఉంటున్నాయని, కొత్త అప్‌డేట్లు అంత గొప్పగా లేవని ఫిర్యాదు చేస్తున్నారు.

"QuitGPT" అంటే ఏమిటి:
ఈ నిరసనను ఆన్‌లైన్‌లో "QuitGPT" పేరుతో ఒక పెద్ద ఉద్యమంలా నడుపుతున్నారు. రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి చోట్ల యూజర్లు  సబ్‌స్క్రిప్షన్ రద్దు చేసిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. దాదాపు 17వేల మందికి పైగా   ChatGPT వాడటం ఆపేస్తామని ఖచ్చితంగా  చెబుతున్నారు. ఈ ఉద్యమంలో యువకులు, పర్యావరణ కార్యకర్తలు, టెక్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. సమాచారం ప్రకారం, డిసెంబర్ 2025 నాటికి ChatGPTకి వారానికి దాదాపు 90కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు

నిపుణులు ఏమంటున్నారంటే:
ప్రముఖ మార్కెటింగ్ ప్రొఫెసర్ స్కాట్ గాల్లోవే మాటల నుంచి ఈ ఉద్యమం మొదలైంది. "పెద్ద కంపెనీలు తమకు నచ్చని పనులు చేసినప్పుడు, ప్రజలు వాళ్ళ  డబ్బుతో (సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయడం ద్వారా) నిరసన తెలపాలి" అని ఆయన పిలుపునిచ్చారు. అయితే, 2025 చివరి నాటికి ChatGPTకి వారానికి దాదాపు 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కాబట్టి, ఈ కొద్దిమంది నిరసన వల్ల కంపెనీకి పెద్దగా  ఆర్థిక నష్టం జరుగుతుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా QuitGPT పై OpenAI నుండి ఎటువంటి స్పందన లేదు.

►ALSO READ | కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. 1,048 పాయింట్లకు పైగా పడిపోన సెన్సెక్స్.. 4.62 లక్షల కోట్లు మాయం..