కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. 1,048 పాయింట్లకు పైగా పడిపోన సెన్సెక్స్.. 4.62 లక్షల కోట్లు మాయం..

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. 1,048 పాయింట్లకు పైగా పడిపోన సెన్సెక్స్.. 4.62 లక్షల కోట్లు మాయం..

స్టాక్ మార్కెట్ ఈరోజు వరుసగా రెండవ రోజు కూడా తీవ్ర నష్టాలను చూసింది. ఐటీ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,048 పాయింట్లు (1.25 శాతం) పడిపోయి 82,626.76 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా 336 పాయింట్లు (1.3 శాతం) పడిపోయి 25,471.10 వద్ద ముగిసింది. ఈ ఫలితంగా బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4.62 లక్షల కోట్లు తగ్గి రూ.467 లక్షల కోట్లకు చేరుకుంది.

ఇక ఐటి స్టాక్‌లు వరుసగా రెండవ రోజు కూడా తీవ్ర క్షీణతను చూశాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఐటి ఇండెక్స్ 5 శాతం పడిపోగా.. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 26 క్షీణించాయి. ఇన్ఫోసిస్ 5 శాతానికి పైగా పడిపోగా, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్ 4 శాతానికి పైగా పడిపోయాయి.  భారతీ ఎయిర్‌టెల్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ బ్యాంక్ స్వల్ప లాభాలను  చూశాయి. గురువారం ప్రారంభంలో సెన్సెక్స్ 559 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 146.65 పాయింట్లు పడిపోయింది.

ALSO READ : భారీగా తగ్గిన బంగారం, ఒక్కరోజే 15 వేలు పడిపోయిన వెండి..

ఐటీ స్టాక్స్ భారీగా పతనం
రెండు రోజుల్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 10 శాతం పడిపోయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ , విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్  4 నుంచి 6 శాతం వరకు పడిపోయాయి. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ స్టాక్ బీఎస్‌ఈలో ట్రేడింగ్ సమయంలో దాదాపు 6 శాతం తగ్గి రూ.1,281.55కి చేరుకుంది, ఇది 52 వారాల కనిష్ట స్థాయి. టీసీఎస్ స్టాక్ కూడా 4 శాతానికి పైగా తగ్గి 52 వారాల కనిష్ట స్థాయి రూ.2,579కి చేరుకుంది.