హైదరాబాద్, వెలుగు: టీజీ 20 లీగ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి (43 బాల్స్‌లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఈ చాంపియన్స్ 6 వికెట్ల తేడాతో వరంగల్ వారియర్స్‌పై గెలిచింది.
ఫలితంగా 10 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. టాస్ గెలిచిన వరంగల్ 20 ఓవర్లలో 173/9 స్కోరు చేసింది. అమన్ రావు (45), రిషికేత్ సిసోడియా (38), షౌనక్ కులకర్ణి (24), హర్షిత్ చౌదరి (22) ఫర్వాలేదనిపించారు. అజయ్ దేవ్ గౌడ్ 3 వికెట్లు తీశాడు.
తర్వాత ఈ చాంపియన్స్ 15.3 ఓవర్లలో 178/4 స్కోరు చేసి నెగ్గింది. అభిరథ్‌కు తోడుగా గడుగు గణేష్ (50) రాణించాడు. అభిరథ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
