ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్: తొలి టీ20 మ్యాచ్ ను ఆపేసిన వర్షం... 

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్: తొలి టీ20 మ్యాచ్ ను ఆపేసిన వర్షం... 

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య డర్హమ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. బుధవారం ( జులై 1 ) జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది.ఇండియా ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే డర్హమ్  భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు కటాఫ్ సమయం కోసం వేచి చూసినప్పటికీ, వర్షం ఎంతసేపటికి తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (47 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 68), అభిషేక్‌‌ శర్మ (24 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 59), శివమ్‌‌ దూబే (21 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 42 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. టాస్‌‌ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 189/7 స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌లో ఇంగ్లిష్‌‌ బౌలర్లు విజృంభించడంతో.. రెండో ఓవర్‌‌ ముగిసేసరికి శాంసన్‌‌ (1), ఇషాన్‌‌ కిషన్‌‌ (0) ఔటయ్యారు. దాంతో 6/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌ను అభిషేక్‌‌, శ్రేయస్‌‌   ఆదుకున్నారు. 61/2తో పవర్‌‌ప్లేను ముగించారు. 

20 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన అభిషేక్‌‌ 9వ ఓవర్‌‌లో ఔట్‌‌ కావడంతో మూడో వికెట్‌‌కు 82 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. శ్రేయస్‌‌తో కలిసి తిలక్‌‌ వర్మ (13) మెరుగ్గా ఆడే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌ కాలేదు. నాలుగో వికెట్‌‌కు 36 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. చివర్లో శివమ్‌‌ దూబే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 38 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన శ్రేయస్‌‌తో కలిసి ఐదో వికెట్‌‌కు 41 రన్స్‌‌ జత చేశాడు. సకీబ్ మహ్మద్‌‌ 3 వికెట్లు తీశాడు.