హైదరాబాద్, వెలుగు: అంకం రాహుల్ అనుమానాస్పద మృతిపై విచారణ చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ , రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు కోరారు. బుధవారం రాహుల్ తల్లిదండ్రులు రాజేశ్వర్, వనితతో కలిసి ఆయన డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. ఈ ప్రతినిధి బృందంలో బీసీ నేతలు శ్రీకాంత్, కొండల్ గౌడ్, లింగేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ మృతికి దారితీసిన పరిస్థితులను డీజీపీ దృష్టికి చిరంజీవులు తీసుకెళ్లారు. బండరాయి కట్టుకుని మృతి చెందడం సహజ మరణం కాదని.. అనుమానాస్పద మరణమేనని చెప్పారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఇప్పటివరకు అనుమానితులను విచారించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితుల ఆవేదనను విన్న డీజీపీ సీవీ ఆనంద్ సానుకూలంగా స్పందించారు.
