జాతీయ బాక్సింగ్‌‌ లో ఎల్కతుర్తి బాలికకు కాంస్యం

జాతీయ బాక్సింగ్‌‌ లో ఎల్కతుర్తి బాలికకు కాంస్యం

ఎల్కతుర్తి, వెలుగు: ఎల్కతుర్తికి చెందిన యువ బాక్సర్ ఎండీ అమ్రీన్ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జలంధర్ లో నిర్వహించిన 5వ అండర్-15 సబ్-జూనియర్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌‌షిప్ 2026లో 58–61 కిలోల విభాగంలో అమ్రీన్ బ్రాంజ్ మెడల్ సాధించింది. 

కోచ్ గా ప్రభుదాస్ దేవరకొండ వ్యవహరించారు. పోటీలు ముగించుకుని స్వగ్రామానికి చేరుకున్న అమ్రీన్‌‌కు ఎల్కతుర్తి సర్పంచ్,  క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు.