హసన్ పర్తి, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) ఆధ్వర్యంలో 2026- 27 అకాడమిక్ ఇయర్ లో వివిధ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదలైంది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నారు.
మరిన్ని వివరాలకు కేయూ వెబ్‌సైట్ చూడాలని సెంట్రల్ డైరెక్టర్ సురేశ్ లాల్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఫీజును చెల్లించి అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.
