బీఆర్ఎస్ నాయకులపై నర్సంపేట పీఎస్లో కేసు

బీఆర్ఎస్ నాయకులపై నర్సంపేట పీఎస్లో కేసు

నర్సంపేట, వెలుగు: బీఆర్ఎస్ నాయకుల​పై నర్సంపేట పీఎస్​లో కేసు నమోదయ్యింది. ఈనెల 10న నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదుట పెద్ది విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. ఈక్రమంలో విధులను అడ్డుకోవడం, బెదిరించి దుర్భాషలాడారని కానిస్టేబుల్​ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఎస్సై అరుణ్​కుమార్​పై దాడి చేశారని పిటీషనర్​ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నర్సంపేట టౌన్​కు చెందిన శీలం వీరన్న, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాయిడి దుష్యంత్​రెడ్డి, సంగని సూరయ్య, దోనాల రవి, మరికొంత మందిపై కేసు ఫైల్ చేశారు.