వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన శ్రీభీమేశ్వరస్వామివారి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. 13 రోజులకు గానూ హుండీల ద్వారా రూ.66,50,742- ఆదాయం వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు.
అలాగే 36 గ్రాముల బంగారం, 4.100 కిలోల వెండి సమకూరిందన్నారు. హుండీ లెక్కింపును ఈవో రమాదేవి, కరీంనగర్ ఏసీ ఆఫీస్ అబ్జర్వర్ రాజమౌళి, డీఈవో భాస్కర శర్మ పర్యవేక్షించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
