గంగాధర, వెలుగు: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లో రూ.30 లక్షలతో ఆధునీకరించిన బస్టాండ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీని పట్టించుకోలేదని, గంగాధర బస్టాండ్ అధ్వానంగా ఉండేదని, బస్సులు కూడా లోపలికి పరిస్థితి ఉండేది కాదని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బస్టాండ్ ఆధునీకరణకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం భూపతిరెడ్డి, డీఎం విజయమాధురి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, సింగిల్ విండో చైర్మన్ తిర్మల్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరుణాకర్, సర్పంచులు నగేశ్, భాస్కర్, రవి, లింగయ్య, శ్రీనివాస్, ఆనందం, ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, లీడర్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్ ఆధ్వర్యంలో మధురానగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
కొడిమ్యాల, వెలుగు:పేదల సొంతింటి కల నెరవేర్చడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నల్లగొండ గ్రామంలో వీవో బిల్డింగ్, కురుమ సంఘ భవనానికి కాంపౌండ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో లీడర్లు జీవన్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, ముత్యం శంకర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
