నేటి తరానికి రామిశెట్టి రోశయ్య స్ఫూర్తిదాయకం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నేటి తరానికి రామిశెట్టి రోశయ్య స్ఫూర్తిదాయకం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మధిర, వెలుగు: ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన రిటైర్డు ఉపాధ్యాయులు రామిశెట్టి రోశయ్య నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు రామిశెట్టి రోశయ్య శత వసంతాలు పూర్తిచేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా బుధవారం మధిర పట్టణంలో ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరై రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. పూలమాలలు, శాలువాతో సన్మానించారు.  

ఆలయంలో ప్రత్యేక పూజలు 

ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ, ధ్వజ ప్రతిష్ఠ సహిత మహా కుంభాభిషేక మహోత్సవాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమాల్లో ఏపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.