ప్రధాని మోదీ దిమాగీ నక్సల్ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం..నేనూ దిమాగీ నక్సల్ అయినందుకు గర్వపడుతున్నని కైంటర్ ఇచ్చారు. మావోయిస్టు మనస్తత్వం కలిగినవ్యక్తులు వ్యవస్తలో పాతుకుపోయారని, విధానాలను ప్రభావితం చేస్తూ దేశానికి ముప్పుగా మారానని ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో హెచ్చరించారు. Xలో వేదికగా చిదంబరం స్పందిస్తూనేనుదిమాగీ నక్సల్ అయినందుకు ః గర్వపడుతున్నానని రాశారు. అయితే చిదంబరం పోస్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తీవ్రంగా స్పందించారు.
ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలను దిమాగీ నక్సల్స్ అని పిలవలేదని, కేవలం నిర్ధిష్ట వర్గాన్ని ఉద్దేశించిన మాత్రమే అలా అన్నారని కిరణ్ రిజుజు బదులిచ్చారు. మాజీ హోంమంత్రి ఇలా మాట్లాడటం దురదృష్టకరం, దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిచేవిధంగా ఉన్నాయని X లో పోస్ట షేర్ చేశారు కిరణ్ రిజుజు.
మావోయిస్టులకు సపోర్టు చేస్తూ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవారు, వేర్పాటు వాదులతో నిలబడి ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చేవారు,ఈశాన్య ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేసేందుకు కుట్ర చేస్తున్నవారిని ఉద్దేశించి ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని కిరణ్ రిజుజు బదిలిచ్చారు.
