ఉన్నావ్ (యూపీ): అయోధ్య రామమందిర విరాళాల అంశం యూపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. ఉన్నావ్ జిల్లా పుర్వా నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ సింగ్ ఆదివారం ఓ పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఆలయ విరాళాలు అపహరించిన వారికి క్యాన్సర్ వస్తుందని శాపనార్థాలు పెట్టారు.
‘రాముడి సొమ్ము దొంగిలించిన వారికి క్యాన్సర్ వస్తుంది. ఇది దేవుడు విధించే మరణశిక్ష. ఏడాది ఆగి చూడండి వాళ్లకు క్యాన్సర్ వస్తుంది. వాళ్లు పొందే బాధాకరమైన మరణాన్ని, ఆ పరిణామాలను వాళ్ల తదుపరి ఏడు తరాలు గుర్తుంచుకుంటాయి’ అంటూ అనిల్ సింగ్ వ్యాఖ్యానించిన వీడియో వైరల్గా మారింది.
