విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన చిత్రం ‘నాగబంధం’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘చాలా కాస్ట్లీగా తీసిన సినిమా ఇదని, ఘనవిజయం సాధించాలంటూ టీమ్‌కు ఆయన బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ ‘ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడానికి నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెట్టాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన అభిషేక్ గారికి, నిర్మాతలకు రుణపడి ఉంటాను.
ఇందులో ప్రతిదీ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక సినిమా కాదు... ఒక ఎక్స్ పీరియన్స్. మన భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా’ అని అన్నాడు. దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘మన సంస్కృతి, మన మూలాలు, సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం ఇందులో ఉంది. ప్రేక్షకులు ఓ అద్భుతమైన సినిమాను, గొప్ప అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు’’ అని అన్నారు.
ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు థియేటర్లలోనే ఎక్స్పీరియన్స్ చేయాలని నభా నటేష్ చెప్పింది. నిర్మాత కిషోర్, నిశిత మాట్లాడుతూ ‘ప్రేక్షకులు ప్రతి 10 నిమిషాలకు ఒక డిఫరెంట్ వరల్డ్‌ను చూస్తారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఒకే సినిమాలో నాలుగైదు విజువల్ వండర్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాతలుగా సినిమాపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం’ అని చెప్పారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్, మ్యూజిక్ డైరెక్టర్స్ అభే, జునైద్ కుమార్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ తదితరులు పాల్గొన్నారు.
