- ప్రధానులు మోదీ, షరీఫ్‌కు 117 మంది ప్రముఖుల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఇరు దేశాలకు చెందిన మేధావులు, రాజకీయ ప్రముఖులు నినదించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ముగిసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సరిహద్దుల్లో శాశ్వత శాంతి, సుస్థిరత నెలకొనాలని, ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని కోరుతూ భారత్, పాకిస్తాన్‌కు చెందిన 117 మంది ప్రముఖులు ఒక బహిరంగ లేఖ రాశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లను ఉద్దేశించి రాసిన ఈ సంయుక్త లేఖ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్’ ఆధ్వర్యంలో రూపొందిన ఈ విజ్ఞప్తి పత్రంపై భారత్ నుంచి 61 మంది, పాకిస్తాన్ నుంచి 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు.
