TMC MP మహువా మొయిత్రాపై గుడ్లతో దాడి... బీజేపీ గూండాల పనేనంటూ ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ లైవ్‌‌‌‌‌‌‌‌లో ఆరోపణ

TMC MP మహువా మొయిత్రాపై గుడ్లతో దాడి... బీజేపీ గూండాల పనేనంటూ ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ లైవ్‌‌‌‌‌‌‌‌లో ఆరోపణ
  • సామాజిక దురాచారమన్న హైకోర్టు 

కోల్‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మహువా మొయిత్రాకు బుధవారం నాడు చేదు అనుభవం ఎదురైంది.  కోల్​కతా లోని కృష్ణనగర్‌‌‌‌‌‌‌‌లోని ఒక హోటల్‌‌‌‌‌‌‌‌లో మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఎంపీపై నిరసనకారులు కోడిగుడ్లు, వంకాయలతో దాడి చేశారు. బిల్డింగ్ బయట గుమిగూడిన నిరసనకారులు.. నల్లజెండాలు ఊపుతూ ‘గో బ్యాక్’ అని నినాదాలు చేస్తూ కిటికీలపైకి గుడ్లు విసిరారు. 

దీంతో ఎంపీ కర్టెన్ అడ్డం పెట్టుకుని తనను తాను రక్షించుకోవాల్సి వచ్చింది. ఈ గొడవనంతా ఆమె ఆఫీస్ పైఅంతస్తు నుంచి ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ లైవ్ పెట్టి చూపించారు. ‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇలా ఉంది. వీరంతా బీజేపీ గుండాలే” అని ఎంపీ మొయిత్రా మండిపడ్డారు. పోలీసులు, సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ బలగాలు 15 నిమిషాలు లేట్‌‌‌‌‌‌‌‌గా వచ్చాయని, వాళ్లు చూస్తూ కూర్చున్నారే తప్ప క్రౌడ్‌‌‌‌‌‌‌‌ను చెదరగొట్టలేదని ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో మరో వీడియో పోస్ట్ చేశారు. 

అయితే, తాను ఎవరికీ తలవంచేది లేదని, పోలీస్ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌ను రిజెక్ట్ చేస్తున్నానని ప్రకటించారు. కాగా, లీడర్లపై ఇలా గుడ్లు విసరడం ‘ఒక సామాజిక దురాచారంగా మారిందని’ కలకత్తా హైకోర్టు మందలించిన రోజే ఈ ఘటన జరిగింది. ఈ దాడులపై సీరియస్ అయిన హైకోర్టు.. నిందితులపై తీసుకున్న యాక్షన్ ఏంటో వివరిస్తూ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.