సుప్రీంకోర్టు కీలక తీర్పు : చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ కాపీ అందలేదని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వలేం..

సుప్రీంకోర్టు కీలక తీర్పు  : చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ కాపీ అందలేదని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వలేం..

న్యూఢిల్లీ: నిందితుడికి చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ కాపీని ఇవ్వకపోవడం అనే కారణంతో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ కాపీ తనకు అందలేదనే కారణంతో డిఫాల్ట్ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్  కోటీశ్వర్ సింగ్‌‌‌‌‌‌‌‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. 

బీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్ సెక్షన్ 193 (8) ప్రకారం అదనపు కాపీలను దాఖలు చేయనంత మాత్రాన చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ ప్రాధాన్యత తగ్గదని సుప్రీం స్పష్టం చేసింది. సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ తరహాలోనే, బీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ కింద కూడా డిఫాల్ట్ బెయిల్ హక్కు అనేది కేసు స్వభావాన్ని బట్టి 60 లేదా 90 రోజుల వ్యవధిలోగా చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ దాఖలు చేయనప్పుడే వర్తిస్తుందని తెలిపింది.