ఇండియా మార్కెట్లోకి ఆల్ఫాగ్రెప్ మ్యూచువల్ ఫండ్

ఇండియా మార్కెట్లోకి ఆల్ఫాగ్రెప్ మ్యూచువల్ ఫండ్

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్ ఆల్ఫాగ్రెప్ గ్రూపునకు చెందిన ఆల్ఫాగ్రెప్ మ్యూచువల్ ఫండ్ సంస్థ, భారత రిటైల్ పెట్టుబడి మార్కెట్లోకి ప్రవేశిస్తూ తన తొలి మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం పేరు ఆల్ఫాగ్రెప్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. ఈ ఫండ్ ఈ నెల ఆరో తేదీ నుంచి పెట్టుబడుల కోసం అందుబాటులోకి రానుంది. 

ఈ పథకం ద్వారా ఈక్విటీ, డెట్, మనీ మార్కెట్ సాధనాలు, బంగారం , వెండి వంటి కమోడిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఫండ్ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా రవ్​నీత్ సింగ్ వ్యవహరించనున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు కనీసం రూ. 500 అవసరం. సిప్ విధానంలో కూడా రూ. 500 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. 

ఈ పథకం రిస్క్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. కేటాయింపు జరిగిన 15 రోజుల్లోపు విత్‌‌డ్రా చేస్తే ఒకశాతం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది.  ఆ తర్వాత ఎలాంటి చార్జీలుండవు.