ఎంబాపె రికార్డు  గోల్స్‌‌‌‌... ప్రిక్వార్టర్స్‌‌‌‌ లో ఫ్రాన్స్‌‌‌‌

ఎంబాపె రికార్డు  గోల్స్‌‌‌‌... ప్రిక్వార్టర్స్‌‌‌‌ లో ఫ్రాన్స్‌‌‌‌
  • 3-0తో స్వీడన్‌‌‌‌పై విజయం
  • 10 గోల్స్‌‌‌‌తో కిలియన్‌‌‌‌ సరికొత్త రికార్డు

ఈస్ట్‌‌‌‌ రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌ జట్టు దుమ్మురేపుతోంది. బుధవారం జరిగిన రౌండ్‌‌‌‌–32 మ్యాచ్‌‌‌‌లో 3–0తో స్వీడన్‌‌‌‌ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ కిలియన్ ఎంబాపె (45, 74వ ని) రెండు గోల్స్‌‌‌‌తో సరికొత్త రికార్డులు నమోదు చేయగా, బ్రాడ్లీ బార్కోలా (53వ ని) మరో గోల్‌‌‌‌ అందించాడు. ఈ టోర్నీలో ఆరు గోల్స్‌‌‌‌ చేసిన ఎంబాపె.. అర్జెంటీనా స్టార్‌‌‌‌ లియోనల్‌‌‌‌ మెస్సీ (6) సరసన చేరాడు. 

అలాగే నాకౌట్‌‌‌‌ దశల్లో అత్యధిక గోల్స్‌‌‌‌ (10) చేసిన తొలి ఫుట్‌‌‌‌బాలర్‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. బ్రెజిల్‌‌‌‌ ప్లేయర్లు లియోనిడాస్‌‌‌‌, రొనాల్డో (9) రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. వరల్డ్ కప్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో ఎంబాపెకు ఇది 18వ గోల్‌‌‌‌ (18 మ్యాచ్‌‌‌‌లు) కావడం విశేషం. మెస్సీ (29 మ్యాచ్‌‌‌‌లు,19 గోల్స్‌‌‌‌) రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. టోర్నీలో ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌‌‌‌ ఆరంభం నుంచే ఎదురుదాడులు చేస్తూ మ్యాచ్‌‌‌‌ను ఏకపక్షంగా మార్చేసింది. 

మైకేల్‌‌‌‌ ఒలిసే ఐదు గోల్స్‌‌‌‌కు అసిస్ట్‌‌‌‌ చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తీవ్రమైన ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ ఫ్రాన్స్‌‌‌‌ ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. స్వీడన్‌‌‌‌ కేవలం ఏడుసార్లు మాత్రమే గోల్స్‌‌‌‌ కోసం ప్రయత్నించగా, ఫ్రాన్స్‌‌‌‌ 25 సార్లు ప్రత్యర్థి గోల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌పై దాడి చేసింది. మ్యాచ్‌‌‌‌ 85వ నిమిషంలో ఎంబాపె గ్రౌండ్‌‌‌‌ను వీడుతున్న టైమ్‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌ కోచ్‌‌‌‌ డిడియర్‌‌‌‌ డెస్చాంప్స్‌‌‌‌ తలవంచి గౌరవ వందనం ప్రకటించాడు. శనివారం జరిగే ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌.. పరాగ్వేతో తలపడనుంది. 

40 ఏళ్ల నిరీక్షణకు తెర

మెక్సికో సిటీ: గతంలో వరుసగా ఏడుసార్లు నాకౌట్‌‌‌‌ దశలోనే వెనుదిరిగిన మెక్సికో జట్టు ఈసారి అద్భుతం చేసింది. బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో 2–0తో ఈక్వెడార్‌‌‌‌పై గెలిచింది. ఫలితంగా 40 ఏళ్ల తర్వాత ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మెక్సికో ఆటగాళ్లు వీరోచితంగా పోరాడారు. తొలి అర్ధభాగంలో కేవలం తొమ్మిది నిమిషాల వ్యవధిలోనే రెండు కీలక గోల్స్ సాధించారు. 22వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్‌‌‌‌ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌‌‌‌తో ఖాతా తెరిచి మెక్సికోకు 1–-0 ఆధిక్యాన్ని అందించాడు. 

ఆ తర్వాత 31వ నిమిషంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రౌల్ జిమెనెజ్ రెండో గోల్ నమోదు చేశాడు. దీని నుంచి తేరుకున్న ఈక్వెడార్‌‌‌‌ సెకండాఫ్‌‌‌‌లో గోల్స్‌‌‌‌ చేయడానికి ప్రయత్నించినా.. మెక్సికో రక్షణ శ్రేణి సమర్థంగా అడ్డుకుంది. 1986లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌‌‌‌ పోటీలో బల్గేరియాను ఓడించిన తర్వాత మెక్సికో నాకౌట్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. 

ఈ టోర్నీలో క్వినోనెస్‌‌‌‌కు ఇది మూడో గోల్‌‌‌‌ కావడం విశేషం. మెక్సికో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన లూయిస్ హెర్నాండెజ్, జేవియర్ హెర్నాండెజ్ (చెరో 4 గోల్స్) తర్వాతి స్థానంలో ఉన్నాడు. రౌల్ జిమెనెజ్ జాతీయ జట్టు తరఫున తన 47వ గోల్ సాధించి జారెడ్ బోర్ గె ట్టి రికార్డ్‌‌‌‌ను అధిగమించాడు.