న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెల కొన్నా.. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. ఈ మేరకు అమలు చేసిన తాత్కాలిక నియంత్రణ చర్యలను పరిస్థితులు మెరుగుపడడంతో జులై 1 నుంచి ఎత్తివేసినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, తాజాగా పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ పరిస్థితులు ఎదురైనా.. దేశ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మోదీ నిర్ణయాలు తీసు కున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కూడా ఆయన విమర్శలు చేశారు. దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తోందని, ఇంధన సంక్షోభం వస్తుందని ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ ప్రతి సంక్షోభంలోనూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు అండగా నిలిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
