బండ్ల అమ్మకాల జోరు... మారుతి, టాటా, మహీంద్రా టాప్‌‌‌‌‌‌‌‌

బండ్ల అమ్మకాల జోరు... మారుతి, టాటా, మహీంద్రా టాప్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: మారుతి, టాటా, మహీంద్రా అమ్మకాలు జూన్‌‌‌‌‌‌‌‌లో భారీగా పెరిగాయి. ముఖ్యంగా సీఎన్‌‌‌‌‌‌‌‌జీ, ఈవీ బండ్లకు డిమాండ్ కనిపించింది. ఇండియాలో ఈ ఒక్క నెలలోనే 4లక్షల కార్లు అమ్ముడయ్యాయని అంచనా.  

  • దేశీయంగా  మారుతి సుజుకి  1,47,187 యూనిట్లను   అమ్మగలిగింది. ఇవి కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  23.8 శాతం ఎక్కువ.  పెట్రో ధరల పెంపు నేపథ్యంలో ఈ కంపెనీ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–జూన్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 2,18,213 సీఎన్‌‌‌‌‌‌‌‌జీ బండ్లను అమ్మడం విశేషం. 
  • టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌ జూన్‌‌‌‌‌‌‌‌లో  ఏకంగా 67 శాతం భారీ వృద్ధితో 62,076 యూనిట్ల అమ్మకాలను జరిపింది. 
  • మహీంద్రా అండ్‌‌‌‌‌‌‌‌ మహీంద్రా అమ్మకాలు లోకల్‌‌‌‌‌‌‌‌గా  28 శాతం వృద్ధి చెంది 60,393 యూనిట్లకు చేరాయి.  
  • సప్లయర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో అగ్నిప్రమాదం జరగడంతో హ్యుందాయ్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ కంపెనీ జూన్‌‌లో 13,900 యూనిట్ల ఉత్పత్తి నష్టాన్ని ఎదుర్కొంది. మొత్తంగా 39,635 యూనిట్లను అమ్మగలిగింది.
  • టయోటా కిర్లోస్కర్ 8 శాతం వృద్ధితో 28,441 యూనిట్లు, కియా ఇండియా 24,552 యూనిట్లను  అమ్మగలిగాయి.  
  • జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఎంజీ మోటార్  30 శాతం వృద్ధితో 7,568 యూనిట్లను విక్రయించగా, ఇందులో ఈవీల  వాటాయే 75శాతానికి పైగా ఉంది. నిస్సాన్ ఇండియా 3,006 యూనిట్లను విక్రయించింది.