తమిళనాడులోని సేలంలో తమిళగ వెట్రీ కజగం (TVK) పార్టీ చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఓ చేదు ఘటన జరిగింది. ఈ క్రమంలో ఆసుపత్రి వద్ద పోలీసులు, జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.
అసలేం జరిగిందంటే :
సేలంకు చెందిన సూరజ్ అనే కార్యకర్త హీరో విజయ్ ర్యాలీకి హాజరయ్యాడు. సభ జరుగుతుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. సూరజ్‌కు భార్య, ఒక కూతురు ఉంది.
ఈ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై టీవీకే కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో ఆసుపత్రి బయట తీవ్ర ఘర్షణ మొదలైంది. తరువాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
►ALSO READ | భారత్ బంద్కు మిశ్రమ స్పందన
గతంలో కరూర్‌లో జరిగిన విజయ్ ర్యాలీలో తొక్కిసలాట వల్ల 40 మందికి పైగా చనిపోయారు. ఆ చేదు అనుభవంతో ఈసారి కేవలం 4,998 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే క్యూఆర్ కోడ్ ఉన్న పాస్‌లు ఉంటేనే లోపలికి పంపారు.
ఎన్నికల ర్యాలీ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. మిగతా పార్టీలకు ర్యాలీలకు వెంటనే అనుమతి ఇస్తున్నారు, కానీ మా పార్టీ (TVK)కి మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారు. నేను ఇక్కడికి కేవలం ఓట్లు అడగడానికి రాలేదు.. మాకు జరుగుతున్న అన్యాయంపై పోరాడటానికి వచ్చాను అని అన్నారు.
