అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు మళ్లీ బ్రేక్స్ పడటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. 2029లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయే వరకూ శాంతి చర్చలు ఉండబోవని, తాము అప్పటి వరకూ వెయిట్ చేస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదన బులియన్ మార్కెట్లలో భూకంపాన్ని సృష్టించింది. దీంతో ఒక్క రాత్రిలోనే బంగారం, వెండి రేట్లు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. ఈ సమయంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరల పెరుగుదల గురించి తెలుసుకోవటం బెటర్.
ఆగస్టు 11న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు 10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.316 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 513గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 220గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 11, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.
