రూ. లక్షా 40  వేలు ఇవ్వకపోతే.. డ్రగ్స్ కేసులో జైలుకు అంటూ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్..

రూ. లక్షా 40  వేలు ఇవ్వకపోతే.. డ్రగ్స్ కేసులో జైలుకు అంటూ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్..

రూ. లక్షా 40 వేలు ఇస్తే... డ్రగ్స్ కేసులో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొస్తామని..లేదంటే జైలుకు పంపిస్తామని అతని కుటుంబసభ్యులను  బెదిరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు KPHB పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పలపాటి విశ్వనాథ రాజు, సయ్యప రాజు అనే ఇద్దరు వ్యక్తులు NDPS కేసులో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను సంప్రదించారు. పోలీసులకు సమాచారం ఇస్తామని, కేసు నుంచి బయటకు తీసుకురావాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి మొత్తం రూ.లక్షా 40వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం జరిగిన విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు KPHB పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు KPHB పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పలపాటి విశ్వనాథ రాజు, సయ్యప రాజులను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై KPHB పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.