కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్) అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 24 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
మొత్తం ఖాళీలు: 24.
విభాగాల వారీగా ఖాళీలు: డిప్యూటీ మేనేజర్ (ఐటీ) – అప్లికేషన్ డెవలపర్ 1, అసిస్టెంట్ మేనేజర్ (హెచ్ఆర్) 4, అసిస్టెంట్ మేనేజర్ (ఎఫ్ & ఏ) 9, అసిస్టెంట్ మేనేజర్ (ఎంఎం) 4, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) 2, అసిస్టెంట్ మేనేజర్ (ఓఎల్) 1, అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ) 3.
ఎలిజిబిలిటీ
డిప్యూటీ మేనేజర్ (ఐటీ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులు లేదా సమాన సీజీపీఏతో ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ బీఈ/ బి.టెక్ పూర్తి చేసి ఉండాలి. పీఎస్‌యూ, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రఖ్యాత ప్రైవేట్ కంపెనీల్లో ఆఫీసర్ / ఎగ్జిక్యూటివ్ హోదాలో పోస్ట్- క్వాలిఫికేషన్ అనుభవం కనీసం మూడేళ్లు ఉండాలి.
సాంకేతిక నైపుణ్యాలు: అభ్యర్థులకు C#, Java, JavaScript, ASP.NET లేదా PHP టెక్నాలజీల్లో పని చేసిన అనుభవం తప్పనిసరి.
అసిస్టెంట్ మేనేజర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.కాంతోపాటు సీఏ/ ఐసీడబ్ల్యూఏ, సంబంధిత విభాగంలో ఎంబీఏ/ మాస్టర్స్ డిగ్రీ, బీఈ/ బి.టెక్, ఎంసీఏ, హిందీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: డిప్యూటీ మేనేజర్ (ఐటీ) - అప్లికేషన్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు.
ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 24.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ టెస్ట్ (75 శాతం), ఇంటర్వ్యూ (25 శాతం) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.spmcil.comను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్‌లైన్ ఆధారిత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్–1లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు 90 మార్కులకు, సెక్షన్–2లో జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, లాజికల్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు అడుగుతారు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబయి లేదా భోపాల్.
షార్ట్ లిస్ట్: ఆన్‌లైన్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఆన్‌లైన్ టెస్టులో కనీస అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్‌లకు 45 శాతం, ఓబీసీలకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. భర్తీ చేయనున్న నోటిఫైడ్ ఖాళీలకు అనుగుణంగా కేటగిరీల వారీగా ప్రతి ఖాళీకి 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఫైనల్ మెరిట్ లిస్ట్
తుది ఎంపిక కోసం ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కలిపి సంయుక్త స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. కనీస అర్హత మార్కులు జనరల్, ఈడబ్ల్యూఎస్ లకు 55 శాతం, ఓబీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
