సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ' వారణాసి' . అత్యంత భారీ బడ్జెట్ తో , దాదాపు రూ. 1300 కోట్లకు పైగా అంచనాలతో నిర్మిస్తున్న ఈ మూవీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ చిత్రం జానర్ పై గత కొన్నాళ్లుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ ఊహాగానాలకు తెరదించుతూ క్లారిటీ ఇస్తూ .. ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
సైన్స్ ఫిక్షన్ కాదు!
చాలామంది విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ చూసి ఇది సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) ఏమో అని భావించారు. కానీ దర్శకుడు రాజమౌళి దీనిని కొట్టిపారేశారు. వారణాసి సైన్స్ ఫిక్షన్ చిత్రం కాదు.. ఇది పక్కా మైథలాజికల్ అండ్ ఫాంటసీ (Mythological Fantasy) ఎలిమెంట్స్‌తో కూడిన అడ్వెంచర్ ఫిల్మ్ అని ఆయన స్పష్టం చేశారు. చిత్రంలో సైన్స్ ఫిక్షన్ ఛాయలు ఉన్నట్లు అనిపించినా, కథ మాత్రం పురాణ గాథలు , కల్పిత లోకాల చుట్టూ తిరుగుతుందని వెల్లడించారు.
పృథ్వీరాజ్ పాత్రపై ఉత్కంఠ
విలన్ కుంభగా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర గురించి రాజమౌళి ఒక కీలక విషయం చెప్పారు. ఆయన పాత్రకు, సైన్స్ ఫిక్షన్‌కు ఎటువంటి సంబంధం లేదని, విజువల్స్‌లో కనిపిస్తున్న వీల్‌చైర్ వెనుక ఒక బలమైన కథా నేపథ్యం ఉందని తెలిపారు. కేవలం ముఖ కవళికలు, స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే పృథ్వీరాజ్ భయంకరమైన ఇంపాక్ట్ చూపిస్తారని, ఆ పాత్ర మహేష్ బాబు (రుద్ర) పాత్రకు ధీటుగా ఉంటుందని రాజమౌళి హింట్ ఇచ్చారు.
►ALSO READ | "నేనేం సాగర సంగమం తీశానని చెప్పానా? రివ్యూయర్లపై నిర్మాత నాగవంశీ సెటైర్లు!
భారీ తారాగణంతో..
ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, ఆర్. మాధవన్ వంటి ఉద్దండ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాను, జూలై 2026 నాటికి పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారు.
ఐమ్యాక్స్ అనుభవం..
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం సినిమాగానే కాకుండా, ఇదొక ఐమ్యాక్స్ (IMAX) విజువల్ వండర్‌గా ఉండబోతోందని సమాచారం. రుద్ర పాత్రలో మహేష్ బాబు మేకోవర్, అడవుల్లో సాగే యాక్షన్ సీక్వెన్సులు ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
