కొలంబో: ఫిబ్రవరి 15న జరగాల్సిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక వాతావారణ శాఖ బులిటెన్ విడుదల చేసి మరీ వెల్లడించింది. శ్రీలంక వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రత్యేక వాతావరణ బులెటిన్ ప్రకారం.. ఫిబ్రవరి 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్ప పీడనం ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
శ్రీలంకలోని కొలంబో ప్రేమదాస స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 15) జరగాల్సిన ఇండియా, పాక్ మ్యా్చ్ కోసం కోట్ల మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ.. ఈ మ్యాచ్కు వరుణ గండం తప్పేలా లేదు. మ్యాచ్ రోజు కొలంబోలో నల్లగా కారు మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని.. వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో స్పష్టమైంది.
►ALSO READ | IPL 2026: జడేజా కాదు.. రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే..?
