T20 World Cup: టీ 20 వరల్డ్ కప్ లో సంచలనం.. ఆస్ట్రేలియా జట్టును పసికూన జింబాబ్వే జట్టు మట్టికరిపించింది. కంగారూలను కంగారు పెట్టించిన జింబాబ్వే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసి.. జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 169 పరుగులు చేసింది. 170 పరుగుల టార్గెట్ కోసం బరిలోకి దిగిన ఆసీస్.. ఎవరూ ఊహించని విధంగా.. 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంకో మూడు బంతులు మిగిలి ఉండగానే.. ఆసీస్ జట్టు ఓడిపోయింది. జింబాబ్వే బౌలర్లు ధాటికి చేతులెత్తేసిన ఆస్ట్రేలియా.. వరల్డ్ కప్ మ్యాచుల్లో.. ఇప్పటి వరకు ఇదే సంచలనంగా మారింది.
మార్కస్ స్టోయినిస్ (6), ట్రావిస్ హెడ్ (17), జోష్ ఇంగ్లిస్ (8) విఫలం కాగా, టీమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్ సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. జట్టును ఆదుకునే క్రమంలో ఆసీస్ బ్యాటర్లు మాట్ రెన్షా (65), మాక్సీవెల్ (31) కాసేపు పోరాటం చేశారు. చివర్లో వీరు ఔట్ కావడంతో కంగారుల జట్టు ఘోరంగా ఓడిపోయింది.
ALSO READ : ఇటలీ చరిత్రాత్మక విజయం.. టీ20 వరల్డ్ కప్‌లో తొలి గెలుపు
జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ 56 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. ఇది టీ20 ప్రపంచ కప్‌లో అతని తొలి హాఫ్ సెంచరీ. తడివానాషే మరుమాణి, ర్యాన్ బర్ల్ కూడా తలా 35 రన్స్ చేశారు. చివర్లో కెప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ లో మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీసుకున్నారు.
