ఇయర్ ఎండ్ షాపర్లకు పండగ.. హోండా కార్లపై రూ. 1.76 లక్షల వరకు తగ్గింపు

ఇయర్ ఎండ్ షాపర్లకు పండగ.. హోండా కార్లపై రూ. 1.76 లక్షల వరకు తగ్గింపు

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే హోండా అదిరిపోయే ఆఫర్లతో ముందుకొచ్చేసింది. ఈ ఏడాది చివరి నాటికి తన పాపులర్ మోడళ్లపై భారీ స్థాయిలో ప్రయోజనాలను ప్రకటించింది. హోండా విక్రయిస్తున్న అమేజ్, సిటీ, ఎలివేట్ మోడళ్లపై ఏకంగా రూ. 1.76 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. 

హోండా మోడళ్లపై ఆఫర్ల వివరాలు:
1. హోండా ఎలివేట్: ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై అత్యధికంగా రూ. లక్ష76 వేల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఎలివేట్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.
2. హోండా సిటీ: ఎవర్ గ్రీన్ సెడాన్ అయిన హోండా సిటీపై రూ. లక్ష 58వేల వరకు తగ్గింపు ఆఫర్ చేస్తోంది కంపెనీ. దీని ప్రారంభ ధర రూ.11లక్షల 95వేలుగా ఉంది.
3. హోండా అమేజ్: కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కొనుగోలుపై రూ. 87వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. దీని ప్రారంభ ధర రూ.7లక్షల 41వేలుగా ఉంది.

అయితే ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అలాగే ఇవి వేరియంట్, గ్రేడ్, లొకేషన్‌ను బట్టి మారుతుంటాయి. పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దసరా పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం దేశంలో తీసుకొచ్చిన జీఎస్టీ మార్పుల కారణంగా హోండా అమేజ్ రేటు రూ.లక్ష 20వేల వరకు తగ్గింది. ఇక సిటీ మోడల్ రేటు రూ.57వేల 500 తగ్గగా.. ఎలివేట్ రేటు దాదాపు రూ.91వేల 100 వరకు తగ్గింది.

ALSO READ : 40 ఏళ్ల రికార్డులు బద్దలు

ప్రస్తుతం భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో హోండా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఏప్రిల్-నవంబర్ FY26 మధ్య కాలంలో హోండా అమ్మకాలు 9.3% తగ్గి 36,729 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 40,153 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హోండా వాటా కేవలం 1.3% మాత్రమే. అందుకే అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఈ భారీ డిస్కౌంట్లను ప్రకటించిందని తెలుస్తోంది. తక్కువ ధరకే ప్రీమియం కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.