హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీ తన క్లెయిమ్‌ను రిజెక్ట్ చేయడాన్ని వినియోగదారుల కమిషన్‌లో ఆయన సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను వినియోగదారుల కమిషన్ వాయిదా వేసింది.
సీఎం రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి గత ఐదేళ్లుగా నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.20 లక్షల పాలసీకి ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రతీ యేటా పాలసీని రెన్యూవల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2024, మే 13న గుండెనొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆయన కోలుకున్నారు. చికిత్సకు అయిన సొమ్ము రూ.23.50 లక్షలు చెల్లించి నివా బూపా కంపెనీ పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు.
కానీ పోస్ట్ పోలియో పెరాలసిస్ ఉన్న విషయాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ పద్మారెడ్డి క్లెయిమ్‌ను నివా బూపా కంపెనీ తిరస్కరించింది. అయితే.. తన మూడో ఏట నుంచే ఆయన పోస్ట్ పోలియో పెరాలసిస్‌తో బాధపడుతున్నాడు. పాలసీ ఇచ్చినప్పుడు దీనిపై అభ్యంతరం చెప్పని ఇన్సూరెన్స్ కంపెనీ.. తీరా చికిత్స పొంది అయిన ఖర్చు క్లెయిమ్ చేశాక ఆ కారణంతో క్లెయిమ్ రిజెక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పద్మారెడ్డి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పద్మారెడ్డి తరఫు న్యాయవాది వినియోగదారుల కమిషన్‌కు రాతపూర్వత వాదనలు సమర్పించారు. ఈ పిటిషన్‌పై విచారణను వినియోగదారుల కమిషన్ వాయిదా వేసింది.
