మెస్సీకి అరుదైన గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ! ప్రపంచంలో కేవలం 12 మాత్రమే.. ధర ఎంతో తెలుసా?

మెస్సీకి అరుదైన గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ! ప్రపంచంలో కేవలం 12 మాత్రమే.. ధర ఎంతో తెలుసా?

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు  అనంత్ అంబానీ ఒక అత్యంత ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 అంటే 12 మాత్రమే ఉన్న ఈ వాచ్ స్పెషాలిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెస్సీ జామ్‌నగర్ వంటారా సందర్శించిన సమయంలో అనంత్ అంబానీ ఆయనకు రిచర్డ్ మిల్లె (Richard Mille) బ్రాండ్‌కు చెందిన 'RM 003-V2 GMT టూర్‌బిల్లాన్ ఆసియా ఎడిషన్ వాచ్‌ను గిఫ్ట్ ఇచ్చారు. దీని ధర అక్షరాలా రూ. 10 కోట్ల 91 లక్షలు.  ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ మోడల్ వాచ్‌లు ప్రపంచం మొత్తంలో కేవలం 12 మాత్రమే ఉన్నాయి  అని చెబుతున్నారు.

ఈ వాచ్ డిజైన్  చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీని లోపల ఉండే మెకానిజం బయటకు కనిపించేలా డిజైన్ చేశారు. ఇది చాలా తేలికగా, దృఢంగా ఉంటుంది.

మెస్సీకి అనంత్ అంబానీ గిఫ్ట్ ఇవ్వడమే కాదు,  అనంత్ అంబానీ పెట్టుకున్న మరో వాచ్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్ అనే వాచ్ ధరించి కనిపించారు. దీని ధర సుమారు రూ. 45.59 కోట్లు. 

అయితే ఈ ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి వాచ్‌లంటే చాలా ఇష్టం. ఆయన కలెక్షన్‌లో ఉన్న మరికొన్ని అద్భుతమైన వాచ్‌లు  చూస్తే  రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా లే మాన్స్, ఇది 18 క్యారెట్ల(18k) పసుపు బంగారంతో తయారైంది. మరొకటి రోలెక్స్ GMT-మాస్టర్ II, అలాగే ఇంకొకటి  పాటెక్ ఫిలిప్ వరల్డ్ టైమ్ మినిట్ రిపీటర్- ఇది ప్రపంచంలోని అత్యంత లగ్జరీ వాచ్‌లలో ఒకటి. వీటితో పాటు ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ జంబో, బార్బీ రోలెక్స్ డేటోనా, పాటెక్ ఫిలిప్ నాటిలస్ 5711/111P-001 లాంటి ఎన్నో ఖరీదైన వాచ్‌లు మెస్సీ దగ్గర ఉన్నాయి.