WAR2: వారియర్‌‌‌‌గా ఎన్టీఆర్, యాక్షన్‌‌ లుక్‌‌లో కియారా.. ట్రెండింగ్లో వార్ 2 కొత్త పోస్టర్స్‌

WAR2: వారియర్‌‌‌‌గా ఎన్టీఆర్, యాక్షన్‌‌ లుక్‌‌లో కియారా.. ట్రెండింగ్లో వార్ 2 కొత్త పోస్టర్స్‌

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్‌‌ అవెయిటింగ్‌‌ స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ ‘వార్‌‌‌‌ 2’.ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్‌‌ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. కియారా అద్వాని హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

వార్‌‌‌‌ 2 రిలీజ్‌‌కు సరిగ్గా యాభై రోజుల ఉందని తెలియజేస్తూ హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీల సరికొత్త పోస్టర్స్‌‌ను విడుదల చేశారు. ఇద్దరు హీరోలకు సంబంధించి ఇప్పటికే లుక్స్ రివీల్ కాగా.. కియారా మాత్రం ఈ పోస్టర్‌‌‌‌తో సర్ప్రైజ్ చేసింది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌లో బికినీతో ఆకట్టుకుందామె. దీంతో ఇందులో కియారా ఫుల్‌‌ లెంగ్త్ గ్లామర్ రోల్‌‌లో కనిపించబోతోంది అనుకున్నారు అభిమానులు. వాళ్లందరికీ షాక్ ఇస్తూ ఫుల్‌‌ యాక్షన్‌‌ లుక్‌‌లో కనిపించింది.

బ్లాక్ కలర్ లెదర్‌‌‌‌ జాకెట్‌‌, చేతిలో గన్‌‌తో సీరియస్‌‌ లుక్‌‌లో ఉన్న ఈ పోస్టర్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో టీజర్‌‌‌‌లో  కనిపించింది.

ఆ ఇద్దరికీ ఏమాత్రం తీసిపోని రీతిలో కియారా కూడా కనిపించబోతోందని తాజా పోస్టర్‌‌‌‌తో అర్థమవుతోంది. అద్భుతమైన విజువల్స్, వావ్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్‌‌తో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు.