మామూలోడు కాదు.. 180 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడు.. హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు !

మామూలోడు కాదు.. 180 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడు.. హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు !

హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ 180 కేసులలో నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. 2026 జూన్ 02వ తేదీన  హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 

నిందితుడిని  మహమ్మద్ ఫైజల్ షా అలీ జాబ్రి అలియాస్ అబ్దుల్లా అలియాస్ అల్తాఫ్ (43) గా గుర్తించారు. ఆసిఫ్ నగర్ లోని మురాద్ నగర్ నివాసి అని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు చెప్పారు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు చైన్ స్నాచింగ్ నే వృత్తిగా మార్చుకున్నట్లుగా అలవాటు పడినట్లు తెలిపారు. తెలంగాణలో రిజిస్టర్ అయిన ఎన్నో కేసులలో నిందితుడని తెలిపారు. అతనిపై 14 నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నట్లు చెప్పారు. 

►ALSO READ | హైదరాబాద్లో భారీ దోపిడి.. ఫ్యామిలీ ఇంట్లో లేనిది చూసి.. రూ.50 లక్షల బంగారం చోరీ

2023లో సైఫాబాద్, మొఘల్ పుర, చార్మినార్, నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు చెప్పారు. దొంగతనం చేసిన తర్వాత కేసు నుంచి తప్పించుకునేందుకు బెంగళూరు పారియినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటికి ఏరుకున్నట్లు తెలిపారు. రాయచోటి, చెన్నూర్ స్టేషన్ పరిధిలో కూడా మరో మూడు దొంగతనీలను చేసినట్లు పేర్కొన్నారు. మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.