హైదరాబాద్ లో భారీ దొంగతనం జరిగింది. ఒక కుటుంబం ఊర్లో లేనిది చూసి పక్కా ప్లాన్ తో 50 లక్షలకు పైగా విలువ చేసే బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. జూన్ 01న వెలుగులోకి వచ్చిన ఈ సిటీ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్ లో జరిగింది ఈ భారీ దోపిడి. మచ్చ బొల్లారంలోని GMR గార్డెన్ రూట్ ఎస్టేట్ కాలనిలో ఓ ఇంట్లో చోరికి పాల్పడ్డ దోపిడి దొంగలు. రమేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ విహారయాత్రకు వెళ్లాడు.
ఫ్యామిలీ ఇంట్లో లేనిది చూసి పక్కా స్కెచ్ తో దోపిడికి పాల్పడ్డారు దొంగలు. 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, సుమారు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.
ఇంటిగేటు, ఇంటి తాళాలు పగలగొట్టిన విషయాన్ని గమనించిన స్థానికులు రమేష్ కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిరిగు ప్రయాణం అయ్యారు బాధిత కుటుంబం.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు పోలీసులు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
