తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ నటించిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో(జూలై 23న) థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా విజయ్.. సీఎం అయ్యాక వస్తున్న మూవీ అవ్వడంతో ఇండియా వైడ్గా స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. వీటికితోడు ‘ఖాకీ’, ‘వలిమై’, ‘తెగింపు’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ H. వినోద్ డైరెక్ట్ చేయడంతో పూర్తిగా పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇండియా అంతటా బుకింగ్స్ మొదలవ్వడంతో సినీ ఫ్యాన్స్ థియేటర్లు షేక్ అయ్యేలా బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భారత్‌లో తొలి రోజు (జూలై 23) టికెట్ బుకింగ్స్ ద్వారా రూ.16.33 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడులోనే హయ్యెస్ట్ బుకింగ్స్..
విజయ్ క్రేజ్ తమిళనాడును దాటి, పలు దేశాల్లో ఏ స్థాయిలో ఉందో పలుమార్లు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో విడుదలకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా బుకింగ్స్ చూసుకుంటే, తమిళ వెర్షన్‌కే ఎక్కువ టికెట్లు అమ్ముడవుతున్నాయి. తమ అభిమాన నటుడు, సీఎం అయ్యాక వస్తున్న మూవీ అవ్వడంతో బుకింగ్స్తో ఫ్యాన్స్ రచ్చ లేపుతున్నారు. ఇప్పటివరకు తమిళంలోనే రూ.11.30 కోట్ల ప్రీ-సేల్స్ నమోదయ్యి.. లెక్క కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం 5 వేలకుపైగా షోలలో 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
తమిళనాడు నుంచి రూ.6.74 కోట్లు
కర్ణాటక నుంచి రూ.4.88 కోట్లు
కేరళ నుంచి రూ.1.80 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక తెలుగు, హిందీ వెర్షన్లకు కూడా బుకింగ్స్ మొదలైనప్పటికీ, వాటి వాటా ప్రస్తుతం తక్కువగానే ఉంది. అయితే విజయ్ గత బ్లాక్‌బస్టర్ సినిమాలైన ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)’ రికార్డులను మాత్రం ‘జన నాయగన్’ ఇంకా అందుకోలేదు. ‘లియో’ విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌లో సుమారు రూ.46.36 కోట్లు, ‘GOAT’ సినిమా రూ.29.83 కోట్లు వసూలు చేశాయి. వాటితో పోలిస్తే ‘జన నాయగన్’ బుకింగ్స్ నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ.. విడుదలకు ముందు చివరి రోజుల్లో మరింత ఊపందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా భారత్‌లో తొలి రోజు రూ.50–60 కోట్ల వరకు ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు.
Raavanamavan daa for a reason 🔥#JanaNayaganFromJuly23
— KVN Productions (@KvnProductions) July 20, 2026
The Hon'ble Chief Minister @actorvijay @TheKVNofficial @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412 @TSeries pic.twitter.com/zTC6EegRkj
ఏడు నెలల సెన్సార్ పోరాటం..
‘జన నాయగన్' సెన్సార్ ప్రక్రియ ఏడు నెలలు సాగింది. తొలుత U/A 16+ సర్టిఫికేట్ సూచించిన సీబీఎఫ్‌సీ, తర్వాత సినిమాను రివైజింగ్ కమిటీకి పంపడంతో ఆలస్యమైంది. అనంతరం మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి, చివరకు అవసరమైన మార్పులు చేసిన తర్వాత సినిమాకు 'A' సర్టిఫికేట్ లభించింది.
ఇదిలా ఉంటే..ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా నిలవనున్న ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
