యూనిఫామ్ కి ఉన్న గౌరవం నిలబెట్టుకోవాలి

యూనిఫామ్ కి ఉన్న గౌరవం నిలబెట్టుకోవాలి

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. 69 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై సుదీర్ఘ అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు.. మూడేళ్ల పాటు లాంగ్ స్టాండింగ్ పోస్టింగ్ లో ఉన్న సీఐలును బదిలీ చేశారు. ఎస్బీ, సీసీఎస్, ట్రాఫిక్ లో పని చేసిన ఇన్స్పెక్టర్లకు లా అండ్ ఆర్డర్  పోస్టింగ్ ఇచ్చారు. ఇక మీదట ప్రతి ఇన్స్పెక్టర్ వ్యక్తిగత జీవితంపై 360 డిగ్రీలో ఎస్బీ ఎంక్వైరీ చేయనుంది. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ లో పనిచేసే ఆఫీసర్ల పై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు ఉన్నతాధికారులు. నాగేశ్వరరావు ఉదంతాన్ని ఇన్స్పెక్టర్ల ముందు ప్రస్తావించిన సీపీ సీవీ ఆనంద్ యూనిఫామ్ కి ఉన్న గౌరవం నిలబెట్టుకోవాలని దిశా నిర్దేశం చేశారు.