వానలకోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రెండురోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని సగం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని తెలపింది. ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే పొద్దంతా వాతావరణం పొడిగా ఉండి సాయంత్రం రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ALSO READ : వెనిజులాలో భూకంపం వచ్చే ముందు గూగుల్‌కు ఎలా తెలిసిపోయింది ?
కొత్తగూడెం, ఖమ్మ, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకుకురుస్తాయని అంచనా వేస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల , రాజన్న సిరిసిల్ల , కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకలు 30 కి.మీలనుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని తెలిపింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడా వానలుపడే ఛాన్స్ ఉందని అంచాన వేసింది ఐఎండీ.
