బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి.. ప్రభాస్ డైలాగ్స్తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అవగాహన వీడియో

బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి.. ప్రభాస్ డైలాగ్స్తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అవగాహన వీడియో

ప్రభాస్‌‌‌‌ ‘ది రాజా సాబ్‌‌‌‌’ టీజర్ రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. యూట్యూబ్లో అదిరిపోయే రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ‘రాజాసాబ్’ టీజర్పై నెలకొన్న పాపులారిటీని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా వాడారు. తమ క్రియేటివ్ ఐడియాలజీతో 'బండి మెల్లగా నడపాలి, హెల్మెట్ ధరించాలి' అనే విషయాలను ప్రభాస్ డైలాగ్స్తో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశారు. 

రాజాసాబ్ టీజర్ లోని 'హలో..హలో.. బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంత అంతా మాత్రం' అనే డైలాగ్ని వాడుకున్న విధానం బాగుంది. యూత్లో మంచి మార్పును తీసుకొచ్చే విధంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టీమ్ క్రియేటివ్గా ఆలోచించింది.

గతంలో ప్రభాస్ నటించిన "సాహో సినిమాలోని ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్తో వీడియో స్టార్ట్ చేయగా.. ఆ వెంటనే బైక్ మీద రయ్ మంటూ ప్రభాస్ దూసుకెళ్తాడు. అప్పుడే రాజాసాబ్ లోని ‘హలో.. హలో బండి కొంచెల మెల్లగా’ అనే డైలాగ్ వచ్చేలా చూపించారు పోలీసులు.

ఇది ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి, తమ డ్రైవింగ్ వేగం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించేవారిలో.. మార్పు తీసుకొచ్చే విధంగా ఉంది. దానికి ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ అంటూ రాజాసాబ్ డైలాగ్ను చెప్పి ఇంపాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత, మిర్చిలో ప్రభాస్ హెల్మెట్ పెట్టుకుని, బైక్ మీద స్లోగా దిగే సీన్ ను యాడ్ చేసి.. ‘హెల్మెట్ ధరించండి, నెమ్మదిగా వెళ్లండి’ అనే క్యాప్షన్ ఇచ్చి మెసేజ్ ఇచ్చారు.

ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆలోచన తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. 'కొందరికీ ఎలా చెబితే అర్ధమవుతుందో.. అలానే చెప్పుకొచ్చారు మన పోలీసులు'.. అంటూ వీడియో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవుతుంది.

►ALSO READ | Arya: హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు

ప్రభాస్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో.. ఫస్ట్ టైమ్ హారర్ జానర్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం కావడంతో అందరి దృష్టి రాజాసాబ్ పైనే ఉంది. ప్రభాస్ కామెడీ రోల్ను చూడటానికి డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ విజువల్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది