భోజనం చేసేందుకు పిల్లలు మారాం చేస్తున్నారా..

భోజనం చేసేందుకు పిల్లలు మారాం చేస్తున్నారా..

రెండేళ్ల వయసు పిల్లల్లో ఫుడ్ తినకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి.

• జలుబు, దగ్గు లేదా ఫుడ్ అరగకపోవడం వల్ల కూడా పిల్లలకి ఫుడ్ తినాలనిపించదు.

• రోజంతా ఆటలు ఆడుకుని అలసిపోతారు. అలాంటప్పుడు ఫుడ్ తినాలనే మూడ్ లో ఉండరు.

• పెద్దవాళ్లలాగే పిల్లలకి కూడా మూడ్ ఛేంజెస్ ఉంటాయి. ఆ టైంలో వాళ్లకి ఫుడ్ తినాలని అనిపించకపోవచ్చు.

ALSO READ :రోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందన్నది నిజమేనా..

తల్లిదండ్రులు చేయాల్సినవి..

• పిల్లలకి హెల్దీ, న్యూటిషియస్ ఫుడ్ తినిపించాలని ఆరాటపడడం మంచిదే. అలాగని పిల్లల ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు మరీ స్ట్రిక్ట్ గా ఉండొద్దు. హెల్దీఫుడ్లో వాళ్లకి ఇష్టమైంది. ఎంచుకునే ఛాన్స్ ఇవ్వాలి.

• ఫుడ్ ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాల ఆకారాల్లో, రంగుల్లో ఉండాలి. న్యూట్రిమఫిన్స్, దాల్ పూరీ, రెయిన్బోకట్లెట్, పాన్ కేక్స్ వంటివి తినిపించాలి.

• వంట చేస్తున్నప్పుడు పిల్లల సాయం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆ రోజు వంటకి కావాల్సిన పదార్థాలను వాళ్లనే సెలక్ట్ చేసుకోనివ్వాలి. ఇలాచేస్తే, ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. తినేటప్పుడు మారాం చేయరు.