రోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందన్నది నిజమేనా..

రోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందన్నది నిజమేనా..

తలస్నానానికి వాడే షాంపూ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. అయితే వాటిల్లో అపోహలే ఎక్కువ అంటోంది డెర్మటాలజిస్ట్ డాక్టర్. జయశ్రీ శరద్ అంటే..

నాలుగు వెంట్రుకలు రాలగానే షాంపూ మార్చేస్తుంటారు చాలామంది. కానీ, నిజానికి ఏ షాంపూ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయదు. అందుకని మాడు మీది చర్మం పొడిగా ఉందా? జిడ్డుగా ఉందా? అనే విషయంతో పాటు సీజన్ ని దృష్టిలో పెట్టుకొని షాంపూ మార్చాలి.

ALSO READ :భోజనం చేసేందుకు పిల్లలు మారాం చేస్తున్నారా..
 

• రోజూ తలస్నానం చేస్తే జుట్టు అపోహ మాత్రమే. రోజూ దుమ్ము, ధూళి జుట్టులోకి చేరతాయి.

చెమట వల్ల తల్లో క్రిములు చేరుతుంటాయి. అందుకే రెగ్యులర్గా తలస్నానం చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఎక్సర్ సైజ్ చేసేవాళ్లు, జుట్టు ఒత్తుగా ఉన్నవాళ్లు తలస్నానం తప్పక చేయాలి.

• సల్ఫేట్తో తయారుచేసిన షాంపూలు జుట్టుకి హాని చేస్తాయన్నది నిజం కాదు. సల్ఫేట్ మంచి క్లెన్సింగ్ ఏజెంట్. ఇది జుట్టులోని జిడ్డు, దుమ్ము, ధూళిని పోగొడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా వాడితే జుట్టు పొడిబారుతుంది. మాడు మీద సహజంగా ఉండే నూనె పోతుంది. ఒకవేళ చర్మం సెన్సిటివ్ అయితే ఇబ్బందులు వస్తాయి. అందుకే జుట్టు, మాడు కండిషన్ని బట్టి షాంపూ ఎంచుకోవాలి.

షాంపూని కేవలం జుట్టుకి -మాత్రమే అప్లయ్ చేయాలనేది మరో అపోహ. అసలు షాంపూ వాడేదే జుట్టులోనిదుమ్ము, ధూళిని పోగొట్టడానికి. అందుకే మాడుకు షాంపూ పెట్టాల్సిందే.