- మంత్రి పొన్నం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఈనెల 17న హైదరాబాద్ నోవాటెల్ లో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ జరగనుంది. ఇందులో భాగంగా దేశంలో రవాణా రంగం, స్మార్ట్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, నగర రవాణా అభివృద్ధి వంటి విషయాలపై చర్చించనున్నారు. సమ్మిట్నిర్వహణపై శుక్రవారం రవాణాశాఖ అధికారులు, ఎలేట్స్ టెక్నో మీడియా ప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమ్మిట్ తో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల మధ్య పరస్పర సహకారం పెరగనుందన్నారు. కేంద్ర, వివిధ రాష్ట్రాల రవాణా అధికారులు, పలు ఆటో మొబైల్, ఈవీ కంపెనీల ప్రతినిధులు, స్టార్టప్ లు, అకాడమిక్ నిపుణులు, పెట్టుబడుదారులు ఈ సమ్మిట్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు, టెక్నో ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
