బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్చేశారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం వారు మాట్లాడుతూ కొఠారీ కమిషన్ నివేదిక ప్రకారం 30 శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుందన్నారు.
