Boycott SRH: నెట్టింట బాయ్‌కాట్ ‘SRH’ ట్రెండ్.. పాక్ ప్లేయర్ ఎంట్రీతో చిక్కుల్లో కావ్య

Boycott SRH: నెట్టింట బాయ్‌కాట్ ‘SRH’ ట్రెండ్.. పాక్ ప్లేయర్ ఎంట్రీతో చిక్కుల్లో కావ్య

Boycott SRH: ఇంగ్లాండ్‌లో జరగనున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఇండియన్ యాజమాన్యానికి చెందిన టీమ్ సన్ రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ని వేలంలో దక్కించుకోవడంతో వివాదానికి దారి తీసింది. ఈ జట్టు ఐపీఎల్ లోని సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) యాజమాన్యమైన సన్ గ్రూప్‌కు చెందింది. వేలంలో అబ్రార్ అహ్మద్‌ను £190,000 (రూ.2.34 కోట్లు)కి కైవసం చేసుకుంది. దీంతో ఎస్ఆర్ హెచ్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ ప్లేయర్ ని ఎన్నో ఏళ్ల  తర్వాత  సన్ రైజర్స్ యాజమాన్యం తీసుకోవడంతో పెద్ద చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ SRH’ ట్రెండ్ కొనసాగుతుంది. అబ్రార్ ని కొనుగోలు చేయడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కొందరు సీరియస్ అవుతున్నారు. 

సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో #BoycottSunrisers, #ShameOnSRH లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింలోకి వచ్చాయి. 2025లో సోషల్ మీడియాలో అబ్రార్ అహ్మద్ చేసిన కొన్ని పోస్టులు భారత సైన్యాన్ని అవమానించేలా ఉన్నాయని పేర్కొంటున్నారు. దీంతో అలాంటి ఆటగాడిని కొనుగోలు చేయడం దేశాన్ని అవమానించినట్లేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సన్‌రైజర్స్ బ్రాండ్ సీఈవోగా ఉన్న కవ్య మారన్ పై కూడా కొందరు అభిమానులు ఫైర్ అవుతున్నారు. లండన్‌లో జరిగిన వేలంలో ఆమె అబ్రార్ అహ్మద్ కోసం భారీగా బిడ్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఈ వివాదానికి మరో కారణం యూకే యాంటీ-డిస్క్రిమినేషన్ చట్టాలు కూడా.. జాతీయత ఆధారంగా ప్లేయర్స్ ని తప్పించడం చట్ట విరుద్ధమని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. దీంతో భారత యాజమాన్యంలోని నాలుగు టీమ్స్.. సన్ రైజర్స్ లీడ్స్, ఎంఐ లండన్ , మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సౌత్ రన్ బ్రేవ్.. పాకిస్తాన్ ఆటగాళ్లను తీసుకోకూడదనే అనధికార రూల్ ని కొనసాగించలేకపోయాయని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వివాదానికి మరికొందరు సపోర్టు చేస్తున్నారు. క్రికెట్ పండితులు మాత్రం పాక్ ప్లేయర్ ని SRH తీసుకోవడాన్ని సమర్థిస్తున్నారు. అబ్రార్ అహ్మద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ వైట్ బాల్ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత 38 టీ20లలో 52 వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ లీడ్స్ అధికారుల ఎంపిక పూర్తిగా జట్టు అవసరాలు, ప్రతిభ ఆధారంగా తీసుకున్నదేనని తేల్చి చెప్పారు.