గోబర్ధన్ పథకానికి గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే

గోబర్ధన్ పథకానికి గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే

న్యూఢిల్లీ: గోబర్ గ్యాస్‎ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన గోబర్ధన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం (ఆగస్ట్ 6) కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోబర్ధన్ పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. 

గోబర్ గ్యాస్‎ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ స్కీమ్ కోసం రూ.23 వేల 731 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే,అస్సాంలో నాలుగు లేన్ల నేషనల్ హైవే నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. రూ.8 వేల 970 కోట్ల వ్యయంతో బెహతా చరియాలీ నుంచి తేజ్‎పూర్ వరకు ఈ జాతీయ రహదారి నిర్మించినున్నట్లు తెలిపారు.