ఓల్డ్‌సిటీ వెలుగు : మీర్చౌక్ పీఎస్పరిధిలోని నూర్ఖాన్బజార్బాల్శెట్టికేత్ ప్రాంతంలో ఇద్దరు బిచ్చగాళ్ల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ప్రాంతంలో హైమద్, అమీర్భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. అడుక్కునే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అమీర్..హైమద్(25)ను రోకలితో బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. హత్య చేసి పారిపోయిన అమీర్ కోసం గాలిస్తున్నట్లు సీఐ కొండలరావు తెలిపారు
