ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఐటీ హబ్ ఎదురుగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్‌మాల్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ పూనుకొల్లు నీరజ, నటి శ్రీలీల హాజరై నిర్వాహకులు కాసం మల్లిఖార్జున్, నమఃశివాయ, శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మాల్ ఓనర్లు కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన వస్త్రాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి సుమారు 300 వందల ఉపాధి కల్పించడం పట్ల మంత్రి ధన్యవాదాలు తెలిపారు. నటి శ్రీలీల మాట్లాడుతూ.. ఉగాది, రంజాన్, శ్రీ రామనవమి పండుగలకు ముందు మాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
