ఇండియాకు బిగ్ రిలీఫ్.. నౌకలకు హాని కలిగించం అంటూ ఇరాన్ ప్రకటన

ఇండియాకు బిగ్ రిలీఫ్.. నౌకలకు హాని కలిగించం అంటూ ఇరాన్ ప్రకటన

పశ్చిమాసియా నుంచి ఇతర దేశాలకు చమురు రవాణా జరగాలంటే ఉన్న ఏకైక మార్గం హర్మూజ్ జలసంధి. ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా ఇరాన్ జలసంధిని మూసివేసింది. అక్కడ నౌకలు కనిపిస్తే పేల్చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో చమురు, గ్యాస్ కొరతతో సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. అయితే జలసంధి గుండా కొన్ని మిత్ర దేశాల నౌకలను అనుమతిస్తోంది ఇరాన్. ఈ క్రమంలో భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. జలసంధి గుండా ఇండియా నౌకలను సురక్షితంగా తీసుకెళ్లవచ్చునని ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఫతాలి శుక్రవారం (మార్చి 13) ప్రకటించడం చాలా పెద్ద ఉపశమనంగా భావించవచ్చు.

త్వరలో భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటవచ్చునని ఆయన ప్రకటించారు. ఇండియా–ఇరాన్ చిరకాల మిత్రులని.. అందులో భాగంగా ఇండియా నౌకలను అనుమతిస్తామని పేర్కొన్నారు. భారత నౌకలను అనుమతిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా.. త్వరలోనే ఇండియా నౌకలను సురక్షితంగా తీసుకెళ్లవచ్చునని పేర్కొన్నారు. ఇండియా మా చిరకాల స్నేహితుడు. రెండు మూడు గంటల్లో చూస్తారు.. ఇరు దేశాల సౌలభ్యం కోసం నిర్ణయం తీసుకుంటాం.. అంటూ ప్రకటించారు. 

యుద్ధంలో ఇండియా ఇరాన్ కు మద్ధతుగా లేనప్పటికీ ఇరాన్ స్నేహహస్తం చాటడం విశేషం. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా ఇండియా సమర్థించింది.  రష్యా, చైనా తటస్థంగా ఉన్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానం అది. అయితే పశ్చిమాసియాపై అమెరికా పెత్తనమేంటి.. మరి దానిపై కూడా తీర్మానం పెట్టాలిగా అనుకున్నాయేమో చైనా, రష్యా తీర్మానానికి దూరంగా ఉన్నాయి. ఇండియా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. 

 అదే విధంగా యుద్ధం మొదలయ్యే ఒక రోజు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ వెళ్లి మద్ధతు ప్రకటించడం కూడా వివాదాస్పదం అయ్యింది. చిరకాల స్నేహితుడు అయిన ఇరాన్ లో సుప్రీం లీడర్ హత్య జరిగినా ఇండియా స్పందించకపోవడంపై విపక్షాలు సైతం మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కశ్మీర్ అంశంలో ప్రపంచం ముందు ఇండియాను బ్లేమ్ చేయాలనుకున్న పాక్ పన్నాగాన్ని కూడా అప్పట్లో ఇరాన్ ఖండించి ఇండియాను సేవ్ చేసిందని.. కానీ ఒక దేశ సార్వభౌమాధికార దేశాధినేతను చంపేస్తే ఇండియా ఖండించకపోవడంపై విమర్శలు వ చ్చాయి. 

ఇలాంటి సుదీర్ఘం స్నేహం ఉన్న ఇరాన్ ను దూరం చేసుకోవద్దని విపక్షాలు సైతం హెచ్చరించాయి. ఇండియా ఇరాన్ కు దూరమవుతందా..? అన్న అనుమానాలు నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఇరాన్ స్నేహహస్తం అందించడం విశేషం. చమురు నౌకల రవాణాకు అంతరాయం కలిగించమని ఇరాన్ ప్రకటించడంతో ప్రస్తుతం ఇండియాలో ఉన్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ సమస్యలకు ఉపశమనం దొరుకుందనటంలో అతిశయోక్తి లేదు.