Sunrisers Leeds: ది హండ్రెడ్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ జట్టు స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ని సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ రూ.2.34 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ యాజమాన్యంపై ఇండియన్ క్రికెట్ అభిమానులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వేలంలో ఫ్రాంచైజీ సన్ రైజర్స్ సీఈవో కావ్యా మారన్, హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్ రైజర్స్ లీడ్స్ అకౌంట్ సస్పెన్స్ కి గురవడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనికి గల కారణాల గురించి ఇప్పటి వరకు ఎక్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. వినియోగదారులు ఆ ఖాతాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే.. 'అకౌంట్ సస్పెండెడ్.. ఎక్స్ సస్పెండ్స్ అకౌంట్స్ దట్ వయోలేట్ ది ఎక్స్ రూల్స్' అని పాప్ అప్ మెసేజ్ వస్తుంది.
కాగా పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ ని జట్టులోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సన్ రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి తెలిపారు. ఈ మెగావేలంలో మేం తొలుత ఆదిల్ రషీద్ ని కైవసం చేసుకోవాలని చూశాం.. కానీ దక్కించుకోలేకపోయాం.. ఈ పరిణామం అనంతరం, ఒక విదేశీ స్పిన్నర్ను తుది జట్టులోకి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం.. మేం అనుకున్న నలుగురైదుగురిలో అబ్రార్ ఒక్కడే మెరుగైన స్పిన్నర్ అని భావించాం. అందుకే అతడిని టీమ్ లోని తీసుకున్నాం' అని డానియల్ వెట్టోరి వెల్లడించాడు.
భారత్–- పాకిస్తాన్ సంబంధాలపై మాట్లాడటానికి సన్ రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి నిరాకరించాడు. అయితే పాక్ క్రికెటర్ల ఎంపిక విషయమై కోచులు, మేనేజ్మెంట్ గానీ వేలానికి ముందు ఎలాంటి విషయం గురించి చర్చించుకోలేదని ధ్రువీకరించాడు. గత ఏడాది నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ 'హండ్రెడ్' బరిలో దిగిన లీడ్స్ జట్టును సన్ టీవీ నెట్వర్క్ పూర్తిగా హస్తగతం చేసుకుంది. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి 49 శాతం వాటాని, మిగిలిన 51 శాతం షేర్ ని యార్క్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నుంచి సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.
🚨SUNRISERS LEADS OFFICIAL ACCOUNT SUSPENDED🚨
— Indian Cricket (@IPL2025Auction) March 13, 2026
- The official X account of Sunrisers Leeds was suspended after facing heavy outrage from Indian fans for buying Abrar Ahmed in The Hundred auction.🤯 pic.twitter.com/LWvxpR4hnc
