ఏఐతో బీమా మోసాలకు చెక్..15 శాతం వరకు ఫ్రాడ్ క్లెయిమ్స్

 ఏఐతో బీమా మోసాలకు చెక్..15 శాతం వరకు ఫ్రాడ్ క్లెయిమ్స్
  • స్టార్ హెల్త్​ డైరెక్టర్ ​హిమాంశు

హైదరాబాద్​, వెలుగు: ఇన్సూరెన్స్​లో మోసాలను అరికట్టడానికి ఏఐను వాడుతున్నట్టు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తెలిపింది. మెడికల్ ​బిల్లులు, ట్రీట్​మెంట్ల వివరాల్లో జరిగే అవకతవకలను ఇది గుర్తిస్తుందని కంపెనీ హోల్​టైమ్ ​డైరెక్టర్ ​హిమాంశు వాలియా చెప్పారు. హైదరాబాద్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి వంద క్లెయిమ్స్​లో 10–15 శాతం వరకు మోసపూరితమైనవి ఉంటున్నాయని,  20 శాతం క్లెయిమ్స్​ను ఏఐ తనిఖీ చేస్తుందని వివరించారు. ఆసుపత్రుల డాక్యుమెంట్లను విశ్లేషించి తప్పుడు క్లెయిమ్స్ ఉన్నప్పుడు ఈ వ్యవస్థ హెచ్చరిస్తుంది. 

డేటా అనలిటిక్స్ సాయంతో గతంలో జరిగిన మోసాల సరళిని బట్టి కొత్త దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తుందని ఆయన వివరించారు.  ‘తెలుగు రాష్ట్రాల్లో మాకు 75 బ్రాంచీలు, 1,800 పైగా ఆసుపత్రుల నెట్​వర్క్ ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు ఏపీ, తెలంగాణ రూ.1,150 కోట్లు విలువైన 1.7 లక్షలు క్లెయిమ్స్ పరిష్కరించాం. మొత్తం ప్రీమియం విలువ రూ.1,990 కోట్లకు చేరింది. 

మా క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియో 91 శాతం ఉంది. జాతీయ స్థాయిలో రోజుకు 5,800 క్లెయిమ్స్​ను పరిష్కరిస్తున్నాం. మా కంపెనీలో క్లెయిమ్స్​ తిరస్కరణ ఎక్కువనే  ప్రచారంలో నిజం లేదు”అని ఆయన వివరించారు.